Click here to read FAQs in English

1) PatrikaPrakatana.com ఏమిటి?

ప్రెస్ నోట్స్ ఆన్ లైన్ లో విడుదల చేయటానికి అనువైన  ఆన్‌ లైన్ ప్లాట్‌ఫామ్ PatrikaPrakatana.com. ఇది మీ కార్యక్రమాలు, కార్యకలాపాలు, వ్యాపార ప్రారంభాలు, ఈవెంట్స్  సమాచారం...ఏమైనా సరే ...అవసరమైనప్పుడు   మీడియా వ్యక్తులకు  చేరవేసే ఓ చక్కని మార్గం.  

2) PatrikaPrakatana.com లో నా ప్రెస్ నోట్స్ ని ఎలా రిలీజ్ చేయాలి?

మొదటగా మీరు ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకుని సభ్యుడు గా చేరాలి. అందుకోసం పెద్దగా శ్రమ పడాల్సిందేమీ లేదు. కేవలం సదరు లింక్ పై మీరు క్లిక్ చేసి, అవసరమైన సమాచారం ఇస్తే చాలు .

3) సభ్యులుగా చేరేందుకు డబ్బు  ఖర్చు పెట్టాలా?

రిజిస్టర్ చేసుకోవడానికి ఫీజు ఏమీ లేదు. ఉచితంగానే చేరవచ్చు.  మీ వివరాలు ధృవీకరించే వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక మీ మెంబర్ షిప్  ని ఆమోదించటం జరుగుతుంది.

4) నేను మీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నాను. కానీ నా మెంబర్ షిప్ స్టేటస్ ఇంకా పెండింగ్ అని చూపెడుతోంది

మేము ప్రతి అప్లికేషన్‌ను క్షుణ్ణంగా సమీక్షించి, పరిశీలించాకే ఆమోదిస్తాము. ఆ క్రమంలో   కొన్నిసార్లు సభ్యత్వాన్ని ఆమోదించడానికి 3-4 రోజులు పట్టవచ్చు. సెలవులు  వస్తే కనుక ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఈ విషయంలో మా వెరిఫికేషన్ టీమ్ తో  సహకరించవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. అత్యవసరమైతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము.

5) గ్రేట్, నా ఎక్కౌంట్ ధృవీకరించబడింది. ఇప్పుడు నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా దాన్ని నేను చేయగలను?

మీ ఖాతాకు లాగిన్ అవడం ద్వారా మీరు ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేయ వచ్చు

6) ఇదేమైనా  ఉచిత సర్వీసా? లేక ఈ సర్వీస్ పొందడానికి నేను ఏమన్నా డబ్బులు కట్టాలా ?

ఇది ఉచిత సర్వీస్ కాదు. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి మీరు  Rs.1,000 (అక్షరాలా వెయ్యి రూపాయలు)  కట్టాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మా రేటు  లిస్ట్ ని చూడవచ్చు.

7) ఏ విధంగా నేను ప్రెస్ నోట్ ని పోస్ట్ చేయగలను?

మీరు మీ ఖాతాకి 'సైన్ ఇన్' చేసి ప్రెస్ నోట్‌ని విడుదల చేయాల్సి ఉంటుంది.

8) తెలుగు కాకుండా ఇతర భాషలలో నా ప్రెస్ నోట్ విడుదల చేయ వచ్చా  .

ప్రస్తుతానికి అయితే  మీరు చేయలేరు. తెలుగులో మాత్రమే ప్రెస్ నోట్ విడుదల చేయాలి

9) నేను నా ప్రెస్ నోట్ విడుదల చేసాను. అందరికీ కనపడేలా 'లైవ్' చేయడానికి ఎంత సమయం పడుతుంది.

వెరిఫికేషన్ టీమ్ మీరు పంపిన ప్రెస్ నోట్ ని  తనిఖీ చేసి, దాన్ని  లైవ్ చేయడానికి కనీసం 48 గంటలు పడుతుంది.ఒకవేళ ఈ ప్రెస్ రిలీజ్  మీకు అత్యవసరం అయితే మమ్మల్ని సంప్రదించండి . వీలైనంత త్వరగా మీ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేస్తాము . వెరిఫికేషన్ నిమిత్తం  మా టీమ్  మీకు కాల్ చేయవచ్చు. దయచేసి సహకరించండి.

10) నా పత్రికా ప్రకటన  'లైవ్'  లో రిలీజ్ అయ్యింది.  తర్వాత ఏమి చేయాలి?

అభినందనలు! ఇప్పుడు ఎవరైనా మీడియా వ్యక్తి మీ పత్రికా ప్రకటనను చూడగలరు.  అలాగే వారు మీ పత్రికా ప్రకటనను ప్రచురించుకోవచ్చు లేదా ఆ ప్రకటన గురించి మరింత సమాచారం కోసం మీకు కాల్ చేయవచ్చు

11) నా పత్రికా ప్రకటనను మీడియా ప్రచురిస్తుంది అని  గ్యారంటీ ఏమైనా ఉందా,

క్షమించండి, ఈ విషయం పై  ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మీడియాను చేరుకోవడానికి మా ప్లాట్‌ఫారమ్ మీకు సహాయం చేస్తుంది. మీ పత్రికా ప్రకటనను మరింత ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది పూర్తిగా మీడియా ఎంపిక. PatriakaPrakatana.com దీనిపై ఎలాంటి హామీ ఇవ్వదు.

12) మీడియా నుంచి నాకు ఎటువంటి స్పందన లేకపోతే నా డబ్బు తిరిగి ఇవ్వబడుతుందా?

లేదు, మీరు చెల్లించిన  ఫీజు  తిరిగి చెల్లించబడదు . అది లిస్టింగ్ ఫీజు గా పరిగణించబడుతుంది.

13) మీ వెబ్‌సైట్‌లో ఎంతసేపు నా ప్రెస్ నోట్ అందుబాటులో ఉంటుంది?

మీ ప్రెస్‌నోట్ మా వెబ్‌సైట్‌లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది . ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా  మా సిస్టమ్ నుండి  తొలగించబడుతుంది.

14) నేను నా ప్రెస్ నోట్‌లో పొరపాటు చేసాను. సవరించుకోవచ్చా?

ఖచ్చితంగా మీరు సవరణ చేయవచ్చు. అయితే అది మా టీమ్ చే మాన్యువల్‌గా ఆమోదించబడాలి. దీని కోసం మళ్లీ 24-48 గంటలు పట్టవచ్చు. ఈ కాలంలో మీ ప్రెస్‌నోట్ ఇన్ యాక్టివ్ గా ఉంటుంది

15) నేను నా ప్రెస్ నోట్‌ని ఎన్నిసార్లు ఎడిట్ చేయగలను?

మీరు మీ  ప్రెస్ నోట్‌  ని కేవలం మూడు  సార్లు మాత్రమే ఎడిట్ చేయగలరు. అది కూడా మీ ప్రెస్ నోట్ పబ్లిష్ అయిన మొదటి పది రోజుల్లోపు మాత్రమే అని గుర్తించుకోండి.

16) 15 రోజుల తర్వాత కూడా నేను ఈ ప్రెస్ నోట్ ని లైవ్ ఉంచాలనుకుంటే ఏమి చేయాలి ?

ప్రెస్ నోట్ గడువు ముగిసే విషయం మీకు రిజిస్టర్ ఈమెయిల్ ద్వారా తెలియచేయబడుతుంది.  మీరు మరో 30 రోజుల పాటు లైవ్ లో ఉంచటం కోసం మరో  రూ.1000/- చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు.

17) నేను నా ప్రెస్ నోట్‌ని తొలగించాలనుకుంటే ఏం చేయాలి ?

మీరు 30 రోజులలో ఎప్పుడైనా " My Press Notes" క్రింద మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేసి, మీ ప్రెస్ నోట్‌లను తొలగించవచ్చు. మేము ఇంతకు ముందు చెప్పినట్లు మీ ప్రెస్ నోట్ జీవిత కాలం 30 రోజులు మరియు మా సిస్టమ్ చేత 31వ రోజు ఆటోమేటిక్ గా తొలగించబడుతుంది.

18) ఒకవేళ మీ సేవల పట్ల సంతృప్తి లేక పొతే నేను కట్టిన డబ్బులు  రిఫండ్ చేస్తారా

లేదు, మేము ఎలాంటి రిఫండ్ ఇవ్వము. మా టర్మ్స్ అండ్ కండిషన్స్  పేజీలో మా రిఫండ్  విధానాన్ని తనిఖీ చేయాలని మేము మీకు గట్టిగా సూచిస్తున్నాము.

19) నేను ఇలాంటి ప్రెస్ నోట్స్ కు  కొత్త, కాబట్టి  ఎలా వ్రాయాలో నాకు తెలియదు. మీరు మాకు సహాయం చేయగలరా?

క్షమించండి, మేము చేయలేము. అయితే, ఇందులో మీకు సహాయం చేయగల కొంతమంది కంటెంట్ రైటర్‌లను మేము సూచిస్తాము. వారు మీకు ఛార్జ్ చేసి, సహాయం చేయవచ్చు. ప్రెస్ నోట్ నాణ్యత,  ఖచ్చితత్వం విషయంలో  మేము ఎటువంటి బాధ్యత వహించము.

20) నేను  ఏ విధమైన ప్రెస్ నోట్స్  రిలీజ్ చేయవచ్చు?

మీరు మీడియా ఎట్రాక్ట్ చేసే ప్రెస్ నోట్స్ విడుదల చేయండి. అదే సమయంలో  కుల,మత సామరస్యాన్ని చెడకొట్టేవి,  ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేవి,  అసభ్యకరమైన ప్రెస్ నోట్స్ పంపవద్దు. వాటిని  మేము అంగీకరించము. చట్ట వ్యతిరేకమైనవి, పబ్లిక్ జీవితాన్ని ఇబ్బంది పెట్టే ప్రెస్ నోట్స్ ని తిరస్కరించే హక్కు మేనేజ్మెంట్ కు ఉంది.

21) ఈ పేజీలో మీరు  ప్రస్తావించని కొన్ని ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. ఎలా మిమ్మల్ని అడగాలి

మిమ్మల్ని  అత్యంత ఆదరంతో స్వాగతిస్తున్నాం. మమ్మల్ని చేరుకోవడానికి ఈ పేజీ పై క్లిక్ చేయండి.

***దయచేసి గమనించండి...ఈ వైబ్ సైట్ కు సంబంధించిన  అన్ని చట్టపరమైన విషయాలు హైదరాబాద్ కోర్టు పరిధికి లోబడి ఉంటాయి.***